అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా 275 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యాన్ని సాధించింది. అయిదో రోజు ఆరు వికెట్లను చేతులో పెట్టుకుని బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకునేందుకు తెగ కష్టపడింది. కానీ ఆసీస్ పేసర్ల ముందు ఇంగ్లండ్‌కు విలవిల తప్పలేదు. ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 207 బంతుల్లో 26 రన్స్ చేసి అనూహ్యంగా హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. బట్లర్ క్రీజ్‌లో ఉంటే ఇంగ్లండ్‌కు పరాభవం దక్కేదికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇంగ్లండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 192 రన్స్‌కు ఆలౌటైంది. తొలి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా పేస్ బౌలర్ రిచర్డ్సన్ రెండవ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు.
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా 473-9, 230-9 డిక్లేర్డ్
ఇంగ్లండ్ 236, 192