యాషెస్ సిరీస్‌ను(Ashes series) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖవాజాకు(Usman Khawaja)సిరీస్ విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది. కాగా, రోండో ఇన్నింగ్స్‌లో 302/8తో ఐదో రోజు అటను కొనసాగించిన ఇంగ్లాండ్ 342 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్(29), జాక్ వెదర్లాండ్(34) శుభారంభాన్నిచ్చారు. తదతనంతరం వచ్చిన బ్యాటర్లు లబుషేన్(37) మినహా ఎవరు రాణించలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్(12), కెరీర్లోనే చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా(6) నిరాశపరిచారు. అలెక్స్ కేరీ(16), కామెరూన్ గ్రీన్(22) నాటౌట్‌గా నిలిచి విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్(3/42) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్384, ఆసీస్ 567 రన్స్‌కు అలౌటయ్యాయి. 26 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(163) మెరిసిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.