AUS vs PAK | పెర్త్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 132/2తో మూడోరోజు ఆట కొనసాగించిన పాకిస్థాన్.. 271 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్ (62) టాప్ స్కోరర్.
ఆసీస్ బౌలర్లలో లియాన్ 3, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు. అనతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు.. శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.ఉస్మాన్ ఖవాజా (34), స్మిత్ (43) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షహజాద్ రెండు వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఓవరాల్‌గా 300 పరుగుల ముందంజలో ఉంది.