IND vs AUS : ఇండోర్‌లోని హోల్కరే స్టేడియం(Holkare Stadium)లో వాన తగ్గింది. దాంతో, పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీ డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆ జట్టు లక్ష్యాన్ని 317 పరుగులుగా ప్రకటించారు. మ్యాచ్ 8:35కి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ పూర్తయ్యాక వాన మొదలైంది. అప్పటికీ కంగారూ జట్టు స్కోర్.. 56-2. మార్నస్ లబూషేన్(17), డేవిడ్ వార్నర్(26) క్రీజులో ఉన్నారు.
టీమిండియా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఆసీస్ కష్టాల్లో పడింది. 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిద్ కృష్ణ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0)లను ఔట్ చేశా. అయితే.. హ్యాట్రిక్ బంతికి లబూషేన్ ఒక పరుగు తీశాడు.