అడిలైడ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూ పేసర్ల ధాటికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైంది. హజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 26 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 188 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 283 రన్స్ కొట్టింది. ట్రావిస్ హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 25వ తేదీ నుంచి బ్రిస్బేన్ వేదికగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరుగనుంది.