లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ వెన్ను గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. నాలుగో వన్డేకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షలలో అతడి వెన్నుకు గాయమైనట్టు తేలడంతో గ్రీన్.. సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
గాయం తీవ్రత ఎక్కువైతే నవంబర్ నుంచి జరిగే భారత్, ఆసీస్ సిరీస్లో అతడు ఆడేది అనుమానమేనని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వర్గాల సమాచారం.