Kane Richardson : ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ (Kane Richardson) ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్లున్న అతడు మంగళవారం తన సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్టు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు ఆసీస్ పేస్ దళంలో కీలకమైన రిచర్డ్సన్.. బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో మరింత పాపులర్ అయ్యాడు. ఈ లీగ్‌లో దాదాపు అన్ని ఎడిషన్లు ఆడిన రిచర్డ్సన్ 2025-26 సీజన్ ముగియగానే ఆటకు అల్విదా చెప్పాడు. క్రికెట్ కోసం నా ప్రతి రక్తపు బొట్టును ధారపోశాను అని పేర్కొన్నాడు రిచర్డ్సన్.
‘క్రికెట్లో 2009లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆటకోసం చెమటోడ్చాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వచ్చిన అవకాశాలను నేను తేలికగా తీసుకోలేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనేది నా కల. ఆ కలను సాకారం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
Former Australia pace bowler Kane Richardson has announced his retirement from professional cricket at the age of 34.
Richardson played 25 ODIs and 36 T20Is and was part of the squad which won the T20 World Cup in 2021
Ful story: https://t.co/o25FrvSrXG pic.twitter.com/oELcPyHmkh
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2026
నా కెరీర్ ఆసాంతం వెన్నుదన్నుగా నిలిచిన కోచ్‌లు, సహచరులు, ఆస్ట్రేలియా క్రికెట్ పాలకవర్గానికి కృతజ్ఞతలు’ అని వీడ్కోలు ప్రసంగంలో చెప్పిన రిచర్డ్సన్ 2021లో అరోన్ ఫించ్ నేతృత్వంలో పొట్టి వరల్డ్‌కప్ గెలుపొందిన జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచకప్ కూడా ఆడిన రిచర్డ్సన్ ఆసీస్ తరఫున 25 వన్డేలు, 36 టీ20లు మాత్రమే ఆడాడు.
దేశవాళీ క్రికెట్లో దక్షిణ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్సన్ … 2008-09లో లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. నిలకడగా రాణించి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడిన అతడు.. 2013లో శ్రీలంకపై వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జెర్సీతో కంటే బిగ్‌బాష్ లీగ్‌లోనే ఈ పేస్ గన్ సత్తా చాటాడు. అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టు ప్రధాన అస్త్రాల్లో ఒకడిగా ఎదిగిన రిచర్డ్సన్ ఆరు సీజన్లు ఆడాడు. 2017-18లో మెల్బోర్న్ రెనెగ్రేడ్స్కు మారిన ఈ స్పీడ్‌స్టర్.. ఎనిమిదేళ్లు ఆ జట్టుతో కొనసాగాడు.
118 matches – 36 of those for the Strikers
3 clubs
142 wickets 🎾
332 runs in 50 innings 🏏
1 BBL title (BBL|08) 🏆Congratulations on a stellar Big Bash career Kane Richardson. Enjoy retirement 👏 pic.twitter.com/zcm9K1ulUJ
— Strikers Central (@StrikersCentral) January 27, 2026
ఈమధ్యే సిడ్నీ సిక్సర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడతడు. మొత్తంగా ఈ టోర్నీలో 142 వికెట్లతో ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ చెలరేగాడీ ఆసీస్ పేసర్. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిచర్డ్సన్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జెర్సీతో మెరిశాడు. ఈ టోర్నీలో 15 మ్యాచులే ఆడిన అతడు 19 వికెట్లు పడగొట్టాడు.