Border – Gavaskar Trophy : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలకు న్యూజిలాండ్ గండికొట్టిన వేళ భారత జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy)లో రోహిత్ సేన ఆడనుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లు భారత్‌కు కీలకం అవుతారని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా ఏతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బొలాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తన టార్గెట్ కేఎల్ రాహుల్ (KL Rahul) అని ఈ స్పీడ్‌స్టర్ అంటున్నాడు. ‘భారత జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ మాకు అమూల్యం. రెండేండ్ల క్రితం అతడికి బౌలింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అతడు నిజంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్. మిడిలార్డర్లో ఓపికగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడగలడు రాహుల్‌పై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తా.
#INDvsAUS pic.twitter.com/s3RGtGiQHl
— Dhanush Kumar (@DhanushKum86669) November 3, 2024
సిరీస్‌లో అతడి వికెట్ సాధించడమే నాతోపాటు జట్టు సభ్యుల ప్రథమ లక్ష్యం’ అని బొలాండ్ తెలిపాడు. నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఐదు వికెట్లతో భారత క్రికెటర్లను ఇరుకున పెట్టిన బొలాండ్.. స్వదేశంలో ఈసారి నిప్పులు చెరిగేందుకు తహతహలాడుతున్నాడు.
భారత్, ఆసీస్‌ల మధ్య నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది. అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి 10 వరకూ రెండో టెస్టు.. అనంతరం బ్రిస్బేన్‌లో డిసెంబర్ 14 నుంచి 18 వరకూ మూడో మ్యాచ్.. మెల్బోర్న్ మైదానంలో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకూ నాలుగో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జనవరి 3వ తేదీన మొదలవ్వనుంది.
BGT start hone se pehle SCOTT BOLAND ki ye WTC-2023 final ki bowling dekh li 😭 pic.twitter.com/Lx5sWXE5RY
— Serenade (@fromAlqama) November 3, 2024
స్వదేశంలో తొలిసారి వైట్‌వాష్ అయిన భారత జట్టు అంతర్మథనంలో పడింది. టర్నింగ్ పిచ్‌ల మీద ఎందుకు బోల్తా పడ్డాం? అని సమాలోచనలు చేస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం తప్ప మరో దారి లేదని గ్రహించిన రోహిత్ సేన అందుకు వ్యూహాత్మకంగా సిద్దం కానుంది. స్క్వాడ్‌లోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశ్విన్‌లకు ఆసీస్ గడ్డపై ఇదే ఆఖరి సిరీస్ కావొచ్చు. అందుకని హ్యాట్రిక్ ట్రోఫీ లక్ష్యంగా టీమిండియా తలపడనుంది.