Common Wealth Games 2026 : ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యానికి ఆస్ట్రేలియా(Australia) సిద్దంగా లేదు. భారీ ఖర్చుతో కూడిన టోర్నీ నిర్వహణకు డబ్బులు సమకూరకపోవడంతో ప్రధాన పట్టణమైన గోల్డ్ కోస్ట్(Gold Coast) ఆతిథ్యానికి నో చెప్పింది. దాంతో, టోర్నీ ఆతిథ్యంపై అనిశ్చితి నెలకొంది. మరో విషయం ఏంటంటే.. టోర్నీ నిర్వహణ కోసం ఇతర దేశాల నుంచి బిడ్స్ ఆహ్వానించాలని సోమవారం కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెగ్ ఫిలిఫ్స్(Craig Philiphs) అంతర్జాతీయ సమాఖ్యకు విన్నవించారు.
‘ఇప్పటివరకైతే కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలకు మొత్తంగా ఆతిథ్యం ఇవ్వకూడదని అనుకోవడం లేదు. కాకపోతే ఇతర ఆఫర్స్ కోసం చూస్తున్నాం. కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణలో సహకరిస్తామని తెలియజేశాం’ అని ఫిలిఫ్స్ వెల్లడించాడు.
ఇక గోల్డ్ కోస్ట్ ఆతిథ్యానికి సిద్ధంగా లేకపోవడానికి మేయర్ టామ్ టేట్ ఏం కారణం చెప్పాడంటే..? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీల నిర్వహణకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. అందుకనే టోర్నీ ఆతిథ్యం ఇవ్వబోమని చెప్పాం అని టేట్ పేర్కొన్నాడు. నాలుగేండ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీకి 2022లో బర్మింగ్హమ్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే.. టోర్నీ సమయంలోనే దక్షిణాఫ్రికా నిధుల లేమితో అష్ట కష్టాలు పడింది.