బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. స్టార్క్(2/48), నెసర్(2/27), స్కాట్ బోలాండ్(2/33) ధాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ జాక్ క్రాలె(44) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఇంకా 43 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. స్టోక్స్(4), విల్ జాక్స్(4) క్రీజులో ఉన్నారు. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 378/6 మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 511 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో స్టార్క్(141 బంతుల్లో 77, 13ఫోర్లు) సూపర్ అర్ధసెంచరీతో కదంతొక్కాడు. కార్స్(4/152), స్టోక్స్(3/113) రాణించారు.