అహ్మాదాబాద్: భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య అహ్మాదాబాద్‌లో జరుగుతున్న నాలుగవ టెస్టు(Fourth Test) డ్రా దిశగా వెళ్తోంది. ఇవాళ అయిదు రోజు భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 73 రన్స్ చేసింది. ఆ జట్టు ఇంకా 18 పరుగులు వెనకబడి ఉంది. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, లబుషేన్‌లు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. హెడ్ 45, లబుషేన్ 22 రన్స్‌తో ఆడుతున్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 571 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Lunch on Day 5 of the 4th Test.
Australia 73/1, trail India (571) by 18 runs.
Scorecard – https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia pic.twitter.com/8a1MQsx5Gq
— BCCI (@BCCI) March 13, 2023