Python | ఆస్ట్రేలియా (Australia) మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (Glenn McGrath) పెద్ద సాహసం చేశాడు. తన ఇంట్లోకి చొరబడిన ఓ కొండచిలువను (Python) మాప్ సాయంతో చాకచక్యంగా పట్టుకొని బయటకు విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇంట్లోని గోడ వద్ద ఉన్న పామును గుర్తించిన మెక్.. ఇల్లు శుభ్రం చేసే మాప్ కర్ర సాయంతో దాని తల భాగాన్ని నియంత్రించాడు. ఆ తర్వాత దాని తోకను పట్టుకుని చాలా ఈజీగా బయటకు తీసుకెళ్లాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన మెక్‌గ్రాత్.. ఇంట్లోకి ప్రవేశించిన మూడు పెద్ద పైతాన్లను తన భార్య సాయంతో పట్టుకుని బయటకు వదిలేసినట్లు వెల్లడించారు.
Also Read..
G20 Summit | జీ20 సమ్మిట్ వేళ.. 15 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్న ప్రధాని..!
Tsunami Alert | రాత్రివేళ మోగిన సునామీ సైరన్.. వణికిపోయిన ప్రజలు
Actor Sathyaraj | సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు.. మంత్రికి మద్దతు తెలిపిన కట్టప్ప