ODI World Cup | సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. 17 ఓవర్లలో 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 17వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వేసిన తొలి బంతిని ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్.. తిరిగి అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.
18వ ఓవర్లో కగిసో రబడా వేసిన రెండో బంతికి మార్కస్ స్టోనిన్స్ అవుటయ్యాడు. రబడా వేసిన బంతిని ఆడిన స్టోనిన్స్ .. నేరుగా డీకాక్ కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ ఐదు పరుగులు మాత్రమే.
అంతకుముందు నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.