NZ vs AUS 2nd T20 : న్యూజిలాండ్ పర్యటనలో వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) అదరగొడుతోంది. వరుసగా రెండో విజయంతో పొట్టి సిరీస్(T20 Series) కైవసం చేసుకుంది. తొలి టీ20లో కివీస్‌ను చిత్తు చేసిన మిచెల్ మార్ష్ సేన.. రెండో టీ20లోనూ గెలుపొందింది. తొలుత ట్రావిస్ హెడ్(45) రాణించడంతో కంగారూ జట్టు 174 రన్స్‌కు ఆలౌట్‌యింది. అనంతరం బౌలర్లు రాణించడంతో బ్లాక్‌క్యాప్స్‌ను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో, మరో మ్యాచ్ ఉండగానే 2-0తో పొట్టి సిరీస్ చేజిక్కించుకుంది.
ఆక్లాండలోని ఈడెన్ పార్క్‌లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు. కంగారూ టీమ్‌లో హెడ్(45), ప్యాట్ కమిన్స్(28), కెప్టెన్ మిచెల్ మార్ష్(26)లు మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ నాలుగు, మిల్నే, శాంట్నర్‌లు తలా రెండేసి వికెట్లు తీశారు.
And the POTM is…
👉 https://t.co/Z5aQUGhEe5 | #NZvAUS pic.twitter.com/nCyzYc20Tr
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2024
స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ అదినుంచి తడబడింది. ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఒక్కడే(42) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్(16), జోష్ క్లార్క్సన్(10)లు కాసేపు పోరాడినా సరిపోలేదు. ఆడం జంపా నాలుగు వికెట్లు తీయడంతో కివీస్ 17 ఓవర్లలోపే ఆలౌటయ్యింది. వరుసగా రెండో ఓటమితో సిరీస్ చేజార్చుకుంది. నామమాత్రమైన మూడో టీ20 ఫిబ్రవరి 25వ తేదీన జరుగనుంది.