Australia Bowlers : సొంతగడ్డపై జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా (Australia) బౌలర్లు అరుదైన ఘనత సాధించారు. భారత జట్టుతో పెర్త్ (Perth) వేదికగా సాగుతున్న మొదటి టెస్టులో అదరగొట్టిన నలుగురు సమిష్టిగా 500 వికెట్లు పడగొట్టారు. పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్లు ఒక్కటిగా సుదీర్ఘ ఫార్మాట్లో 500 వికెట్ల క్లబ్లో చేరారు.
ఈ ఘనత సొంతం చేసుకున్న మొదటి ‘క్వార్ట్లెట్’గా కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, లియాన్లు రికార్డు నెలకొల్పారు. వీళ్లలో కెప్టెన్ కమిన్స్ 130 వికెట్లతో ముందుండగా.. హేజిల్‌వుడ్, స్టార్క్‌లు తలా 124 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇక స్పిన్ దిగ్గజంగా పేరొందిన లియాన్ తన పేరిట 122 వికెట్లు వేసుకొని 500 క్లబ్లో భాగమయ్యాడు.
☝️ Another milestone for the incredible Aussie quartet! 5️⃣0️⃣0️⃣
🇦🇺🏏 Our stats man, @RicFinlay tells us with Josh Hazlewood’s scalp of Virat Kohli, it’s the 500th Test wicket alongside captain Pat Cummins, Mitch Starc and Nathan Lyon when bowling together in Tests for the… pic.twitter.com/z3v39sSBij
— ABC SPORT (@abcsport) November 22, 2024
పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచిన భారత జట్టుకు షాకిస్తూ స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్‌లు వికెట్ల వేట కొనసాగించారు. సొంతగడ్డపై పెట్రేగిపోయిన ఈ పేస్ త్రయం టీమిండియాను 150కే ఆలౌట్ చేసింది. హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా.. స్టార్క్, కమిన్స్‌లు చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత జట్టును స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఆనందం ఆసీస్‌కు లేకుండా పోయింది.
Jasprit Bumrah leads India’s terrific response after getting bowled out early.#WTC25 | #AUSvIND 📝: https://t.co/ptgPRvmH6d pic.twitter.com/FXHLLmYPCb
— ICC (@ICC) November 22, 2024
ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(4/17) సంచలన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. అతడికి తోడుగా సిరాజ్ సైతం విజృంభించడంతో ఆసీస్ ఎదురీదుతోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేసిన ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనకబడే ఉంది.