NTPC Green Energy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.2 లక్షల కోట్ల విలువైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకోసం ఎన్ఆర్ఈడీసీఏపీ తో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చరిత్రాత్మక ఈ ప్రాజెక్టు వల్ల లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అని చంద్రబాబు పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవంలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సహకారంతో 25 గిగావాట్ల సోలార్ / వైండ్ ఇంధనం, 10 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, 0.5 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. న్రెడ్ క్యాప్ ఆధ్వర్యంలో రూ.2000 కోట్ల విలువైన సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇటీవలే రూ.10 వేల కోట్ల విలువైన ఐపీఓకు వెళ్లింది.