సిడ్నీ: పాకిస్థాన్‌తో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కంగారూలు నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యఛేదనలో యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ (5/26) ధాటికి పాక్..19.4 ఓవర్లలో 134 పరుగులకు పరిమితమైంది.
ఉ స్మాన్ఖాన్(57), ఇర్ఫాన్‌ఖాన్(37 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. జంపా (2/19)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత షార్ట్(32), హార్డి(28) రాణించడంతో ఆసీస్ 20 ఓవరల్లో 147/9 స్కోరు చేసింది. హారిస్ రవూఫ్(4/22), అఫ్రీది(3/17) ఆకట్టుకున్నారు.