T20 Worldcup: బంగ్లాదేశ్‌పై 28 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా విజయం
T20 worldcup: టీ20 వరల్డ్‌కప్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 28 రన్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు.
నార్త్ సౌండ్: టీ20 వరల్డ్‌కప్(T20 Wordlcup) సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో నెగ్గింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది. ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలుత బంగ్లాదేశ్‌ను 140 పరుగులకే కట్టడి చేసింది. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు. 29 రన్స్ ఇచ్చి అతను మూడు వికెట్లు తీసుకున్నాడు. టోర్నీలో తొలిసారి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా కీలకమైన రెండు వికెట్లను తీసుకున్నాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుసేన్ షాంటో 41, తౌహిద్ హృదయ్ 40 రన్స్ చేశారు.
స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 11.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆ సమయానికి ఆస్ట్రేలియా 72 రన్స్ చేసిన విజయం వరించినట్లే. అంటే ఆస్ట్రేలియా 28 రన్స్ ఇంకా ఎక్కువే స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 53 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 31 స్కోర్ చేశాడు.
Rain stops play in Antigua but Australia add two crucial Super Eight points in the bag 🙌#T20WorldCup | #AUSvBAN | 📝: https://t.co/pbomB56xTM pic.twitter.com/P8SCMJ6F69
— T20 World Cup (@T20WorldCup) June 21, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

