తిరుమల : వైకుంఠ ద్వార దర్శనానికి (Vaikuntha Dwara Darshan) గురువారం ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు ( Tirumala ) తరలివచ్చారు. దీంతో ఆలయ మాఢవీధులు భక్తుల గోవిందా నామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. వివిధ ప్రాంతాల ను౦చి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోగా శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 85,752 మంది తలనీలాలు సమర్పించుకోగా 19,443 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.69 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.