టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ 2 లో పేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌ను ఓడించి.. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. 6 బంతులు మిగిలి ఉండగానే.. 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా.. స్టార్టింగ్‌లో వికెట్లు కోల్పోవడంతో ఇక ఆస్ట్రేలియా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ.. చివరలో బ్యాటింగ్‌కు దిగిన వేడ్.. కేవలం 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. 19 వ ఓవర్లోనే మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను టర్న్ చేసి ఆస్ట్రేలియాకు విజయం అందించాడు.
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలవలేదు. వన్డే ప్రపంచకప్‌లో గెలిచినా.. టీ20లో గెలవలేదు. ఈసారి ఫైనల్స్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కప్ లక్ష్యంగా ఫైనల్స్‌లో ఆడనుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆస్ట్రేలియాకు కలిసివచ్చింది. ఛేజింగ్ చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి.. 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు అందించింది.
చివర్లలో బ్యాటింగ్‌కు దిగి.. ఓడిపోతుందనుకున్న ఆస్ట్రేలియాను గెలిపించి.. ఫైనల్స్‌కు చేర్చిన వేడ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. వేడ్.. 17 బంతుల్లో 41 పరుగులు చేసి 2 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. నవంబర్ 14న జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ మొదటి ఫైనలిస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆస్ట్రేలియా.. సెమీ ఫైనల్స్ 2లో పాకిస్థాన్‌ను ఓడించడంతో.. రెండో ఫైనలిస్టు అయింది. దీంతో నవంబర్ 14న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టును టీ20 వరల్డ్ కప్ విజేతగా ఐసీసీ ప్రకటించనుంది.
Australia are through to the final of the #T20WorldCup 2021 🔥#PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/z7ebx6BRem
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
Aussie Aussie Aussie 🇦🇺#T20WorldCup pic.twitter.com/p0rk8bBIOc
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021