NZ vs AUS 2nd Test : న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు(Second Test) రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లను విజయం ఊరిస్తోంది. మూడో రోజు కివీస్‌ను ఆలౌట్ చేసిన ఆసీస్ గెలుపు కోసం పోరాడుతోంది. మ్యాట్ హెన్రీ(Matt Henry) బుల్లెట్ లాంటి బంతులతో కంగారూ జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
దాంతో, ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 77 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్(17 నాటౌట్), మిచెల్ మార్ష్(27 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇంకా ఆసీస్ విజయానికి 202 పరుగులు కావాలి. మరోవైపు సిరీస్ సమం కావాలంటే న్యూజిలండ్కు ఆరు వికెట్లు అవసరం.
New Zealand make second innings inroads with four Australia wickets 👀#NZvAUS scorecard 📲 https://t.co/iV7C01q9YV#WTC25 pic.twitter.com/czfpwzDrlt
— ICC (@ICC) March 10, 2024
ఆసీస్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన కివీస్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదల ప్రదర్శించారు. సిరీస్ సమం చేయాలంటే పోరాడక తప్పని పరిస్థితుల్లో టామ్ లాథమ్(72), రచిన్ రవీంద్ర(82), కేన్ విలియమ్సన్(51), డారిల్ మిచెల్(58)లు అర్ధశతకాలతో రాణించారు.
It’s that man Cummins again – ends a fine innings from Rachin Ravindra
Australia throwing some punches post lunch
▶️https://t.co/H62J4pYYhP | #NZvAUS pic.twitter.com/89K7RSCQhU
— ESPNcricinfo (@ESPNcricinfo) March 10, 2024
చివర్లో కుగ్గెలెజిన్(44) ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ జట్టు స్కోర్ 350 దాటించాడు. అయితే కమిన్స్ నాలుగు, లియాన్ మూడు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 372 పరుగులకే ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ లబూషేన్(90) ఒంటరి పోరాటంతో 256 పరుగులు చేయగలిగింది.