చిత్రదుర్గ, డిసెంబర్ 25: కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో ఎదురుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో స్లీపర్ బస్‌కు నిప్పంటుకుని ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ కూడా మృతి చెందాడు.
వెనుక వస్తున్న బస్‌లోని 42 మంది విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్రదుర్గ జిల్లాలో బెంగళూరు-హుబ్బళ్లి హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో బస్తో పాటు ట్రక్కు మంటల్లో కాలిబూడిదైంది. బెంగళూరు నుంచి గోకర్ణకు 32 మంది ప్రయాణికులతో స్లీపర్ బస్ గురువారం తెల్లవారుజామున వెళ్తుండగా, రోడ్ డివైడర్ అవతలి వైపు ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ ట్రక్ అదుపుతప్పి బస్ ప్రయాణిస్తున్న మార్గంలోకి ఎదురుగా వచ్చి ఢీకొన్నది.