South Africa Womens Team : స్టార్ బ్యాటర్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) దక్షిణాఫ్రికా మహిళల జట్టు తాత్కాలిక కెప్టెన్ (Interim Captain)గా ఎంపికైంది. సునే లుస్(Sune Luus) సారథిగా తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్(South Africa Cricket) గురువారం వొల్వార్డ్త్ను టెంపరరీ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. తర్వలో జరుగబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో ఆమెకు సారథిగా మొదటి పరీక్ష ఎదురువ్వనుంది. ఆ సిరీస్ ముగిశాక తర్వాత వొల్వార్డ్త్ను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై బోర్డు ఓ నిర్ణయానికి రానుంది.
వొల్వార్డ్త్ 2016 నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటి వరకూ ఆమె 1 టెస్టు, 80 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL) తొలి సీజన్లోనూ ఈ దక్షిణాఫ్రికా యువ కెరటం మెరిసింది. గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడింది. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన కెప్టెన్ బేత్ మూనీ(Beth Mooney) స్థానంలో ఆమె జట్టులోకి వచ్చింది.
డబ్ల్యూపీఎల్‌లో లారా వొల్వార్డ్త్
ఈ ఏడాది ఆరంభం నుంచి దక్షిణాఫ్రికా మహిళల జట్టును దీర్ఘ కాలిక కెప్టెన్ సమస్య ఏర్పడింది. అందుకు కారణం.. కెప్టెన్‌గా రాణించిన వాన్ నికెర్క్(van Niekerk) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. వరల్డ్ కప్ జట్టు ఎంపిక సమయంలో ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన ఆమె ఆట నుంచి తప్పుకుంది. అయితే.. ఈ సమస్యకు పరిష్కారంగా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఆటగాళ్ల ఫిట్నెస్ విషయాన్ని కోచ్‌లకు వదిలేయాలని తీర్మానించారు. దాంతో, వాన్ నికెర్క్తో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది.