ILT 20 | జనవరి 19 నుంచి రెండో సీజన్.. బరిలో దిగనున్న కొత్త ఆటగాళ్లు వీళ్లే
ILT 20 : ఇంటర్నేషనల్ లీగ్(ILT) మరోసారి అభిమానులను అలరించనుంది. రెండో సీజన్ జనవరి 19 నుంచి మొదలవ్వనుందని నిర్వాహకులు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) గడ్డపే జరిగే ఈ టోర్నీ షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఫిబ్రవరి 18న టోర్నీ విజేత ఎవరో తేలిపోనుంది. అయితే.. మొదటి సీజన్ మాదిరిగానే దక్షిణాఫ్రికా....
ILT 20 : ఇంటర్నేషనల్ లీగ్(ILT) మరోసారి అభిమానులను అలరించనుంది. రెండో సీజన్ జనవరి 19 నుంచి మొదలవ్వనుందని నిర్వాహకులు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) గడ్డపే జరిగే ఈ టోర్నీ షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఫిబ్రవరి 18న టోర్నీ విజేత ఎవరో తేలిపోనుంది. అయితే.. మొదటి సీజన్ మాదిరిగానే దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA20) సమయంలోనే ఈ టోర్నీ జరగనుంది. అవును.. దక్షిణాఫ్రికా లీగ్ రెండో సీజన్ జనవరి 10 న మొదలై ఫిబ్రవరి 10న ముగియనుంది. ఐఎల్టీ రెండో సీజన్లో కొందరు స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
వాళ్లు ఎవరో తెలుసా..? డేవిడ్ విల్లే, జోష్ లిటిల్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, అకీల్ హొసేన్, కోరే అండర్సన్. ఈ మధ్యే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు(Ambati Rayudu) ఎంఐ ఎమిరేట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు … తొలి సీజన్లో దుబాయ్ క్యాపిటిల్స్కు ఆడిన కొందరు స్టార్ ఆటగాళ్లకు ఈసారి జట్టులో చోటు దక్కలేదు. యూసుఫ్ పఠాన్(Yusuf Pathan), రాబిన్ ఊతప్ప(Robin Uthappa).. ఈ ఇద్దరికీ ఉద్వాసన పలికింది.
తొలి సీజన్ చాంపియన్ ఎంఐ ఎమిరేట్స్

రెండో సీజన్లో కూడా ఆరు జట్లు పాల్గొననున్నాయి. అబుదాబీ నైట్ రైడర్స్, డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ సీజన్లో 34 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 30 లీగ్ మ్యాచ్‌లు కాగా నాలుగు ప్లే ఆఫ్స్. ప్లే ఆఫ్స్‌లో విజయం సాధించిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. నిరుడు ఎంఐ ఎమిరేట్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఫైనల్లో షార్జా వారియర్స్‌పై 49 పరుగుల తేడాతో గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది.
ఇవి కూడా చదవండి
WFI | భారత్‌కు షాక్.. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వం రద్దు : ప్రకటించిన యూడబ్ల్యూడబ్ల్యూ
Chandrayaan-3 | చంద్రయాన్-3 సక్సెస్.. ఇది బ్యాటింగ్ పిచ్ అంటున్న లెజెండరీ బ్యాటర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

