WFI | భారత్‌కు షాక్.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వం రద్దు : యూడబ్ల్యూడబ్ల్యూ
WFI | ప్రపంచ వేదికపై భారత్‌కు గట్టి షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) రద్దు చేసింది.
WFI | ప్రపంచ వేదికపై భారత్‌కు గట్టి షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ (UWW) వెల్లడించింది. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్ఐ అడహాక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు (Indian Wrestlers) రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడే అవకాశం లేకపోవడంతో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడాల్సి ఉంటుంది. భారత్ ట్యాగ్‌లైన్ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.
ఇటీవలే మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ షరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్ఐ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శరణ్ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని మహిళా రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రద్దు చేసింది. ఆ తర్వాత WFI కార్యకలాపాల నిర్వహణను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి 45 రోజుల్లోగా WFI ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాలి. గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదని ఏప్రిల్ 28న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించింది. అప్పటి నుంచి ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించాలని చూసినా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది.
Also Read..
Elon Musk | ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టింది.. ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

