Elon Musk | ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టింది.. ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్
Elon Musk | రష్యా (Russia)పై ఇటీవలే తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ విమానం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కుప్పకూలింది. ప్రిగోజిన్ మృతిపై ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం స్పందించారు. ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టిందని అన్నారు.
Elon Musk | రష్యా (Russia)పై ఇటీవలే తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ విమానం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కుప్పకూలింది. ప్రమాదంలో ప్రిగోజిన్ సహా 10 మంది మరణించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. అయితే, ఈ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా మారడమే ప్రిగోజిన్ మరణానికి కారణమైందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రిగోజిన్ మృతిపై ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం స్పందించారు. ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సైతం ఇదే విధంగా స్పందించారు. ప్రిగోజిన్ మరణవార్త తనను ఆశ్చర్య పరచలేదని అన్నారు. ఏం జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని, కానీ ఊహించిందే జరిగిందన్నారు.
మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయిందని.. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు టాస్ ఏజెన్సీ తెలిపింది. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడు మంది ప్యాసింజెర్లు ఉన్నారు. అందరూ మృతిచెందినట్లు తెలిపింది. వీరిలో ప్రిగోజిన్ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది.
Also Read..
Prigozhin: ప్రిగోజిన్ ప్రయాణించిన విమానం ఇలా కూలింది.. వీడియోలు
Joe Biden | ప్రిగోజిన్ మృతి.. బైడెన్ ఏమన్నారంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

