Joe Biden | రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో ప్రిగోజిన్ సహా 10 మంది మరణించారు. ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. ఆయన మరణవార్త తనను ఆశ్చర్య పరచలేదని అన్నారు. ఏం జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని, కానీ ఊహించిందే జరిగిందన్నారు.
రష్యా (Russia)పై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయిందని.. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు తెలిపింది. వీరిలో ప్రిగోజిన్ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది.
Also Read..
Chandrayaan-3 | చంద్రుడిపై భారత్ అడుగులు మొదలయ్యాయి : ఇస్రో ట్వీట్
Chandrayaan – 3 | చంద్రయాన్-3 మిషన్ సక్సెస్.. భారత్‌పై పుతిన్ ప్రశంసలు