Chandrayaan – 3 | చంద్రయాన్-3 మిషన్ సక్సెస్.. భారత్‌పై పుతిన్ ప్రశంసలు
Chandrayaan - 3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) సైతం భారత్‌ను అభినందించారు.
Chandrayaan – 3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) సైతం భారత్‌ను అభినందించారు.
అంతరిక్ష పరిశోధనలో ఇదొక పెద్ద ముందడుగు అని, సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భారతదేశం పురోగతికి నిదర్శనమని పుతిన్ పేర్కొన్నారు. ‘భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా భారత్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అంతరిక్ష పరిశోధనలో ఇదొక పెద్ద ముందడుగు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతికి ఈ విజయం నిదర్శనం. దీన్ని సాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాయకత్వం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు’ అని పుతిన్ పేర్కొన్నారు.
Also Read..
Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన పరిశ్రమలు ఇవే..
Chandrayaan-3 | ఆదిపురుష్ సినిమా కంటే కూడా చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

