Chandrayaan-3 | జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అన్వేషణే లక్ష్యంగా చేపట్టిన చంద్రయాన్-3లో దేశీయ పరిశ్రమలూ భాగమయ్యాయి.ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆయా రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల విడిభాగాలను అందించాయి.హైదరాబాద్‌కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్ కీలకపాత్ర పోషించడం గమనార్హం. ఇక్కడి మిశ్ర ధాతు నిగమ్ సైతం ఇస్రోకు సహకరించింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 23: చంద్రుడి రహస్యాలపై పరిశోధనల కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 మిషన్‌లో దేశీయ పరిశ్రమలదీ కీలకపాత్రే. లార్సన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ), హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీహెచ్ఈఎల్, ఎంటార్ టెక్నాలజీస్, మిశ్ర ధాతు నిగమ్.. ఇలా ఎన్నో కంపెనీలు ఇస్రో ప్రాజెక్టుల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఏయే సంస్థలు.. ఏయే భాగాలను అందించాయన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళ్తే..
చంద్రయాన్ మిషన్ లాంచ్ వెహికిల్ మార్క్-3 (ఎల్వీఎం3), ఎం4 ప్రారంభంలో ఎల్అండ్టీ భాగస్వామిగా ఉన్నది. క్రిటికల్ బూస్టర్ సెగ్మెంట్స్‌ను తయారు చేసింది. పొవాయ్‌లోని ఎల్అండ్టీ ప్లాంట్ వద్దే ప్రూఫ్ ప్రెజర్‌ను పరీక్షించారు. భారతీయ అంతరిక్ష పరిశోధనలకు వెళ్తున్న వ్యోమనౌకల వ్యవస్థ ఇంటిగ్రేషన్లోనూ ఎల్అండ్టీ పాత్ర ఉంటున్నది.
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్-ఎల్అండ్టీ కన్సార్షియం నుంచి జాతీయ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్ఏఎల్)కు వివిధ రకాల విడిభాగాలు అందుతున్నాయి. చంద్రయాన్-3 మిషన్‌లోనూ ఈ భాగాలు ప్రముఖంగా నిలిచాయి.
చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రోకు తమ 100వ బ్యాటరీని సరఫరా చేసి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఓ కీలక మైలురాయిని అధిగమించింది.
హైదరాబాద్‌కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్.. చంద్రయాన్-3లో ప్రధాన పాత్రే పోషించింది. వికాస్ ఇంజిన్లు, టర్బో పంప్, బూస్టర్ పంప్, గ్యాస్ జనరేటర్, ఇంజెక్టర్ హెడ్ వంటి క్రయోజెనిక్ ఇంజిన్ సబ్‌సిస్టమ్స్, లాంచ్ వెహికిల్ మార్క్-3 కోసం ఎలక్ట్రో-న్యూమ్యాటిక్ మాడ్యుల్స్‌ను తయారు చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్రభు త్వ రంగ సంస్థ.. కోబాల్ట్ బేస్ అల్లాయ్స్, నికెల్ బేస్ అల్లాయ్స్, టైటానియం అల్లాయ్స్ వంటి మెటీరియల్స్ అభివృద్ధి, సరఫరాలో పాలుపంచుకున్నది. లాంచ్ వెహికిల్ మార్క్-3 (ఎల్వీఎం3), ఎం4లోని వివిధ విడిభాగాల కోసం ప్రత్యేక స్టీల్‌ను అందించింది. వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లడానికి ఎల్వీఎం3, ఎం4లే అవసరం. ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టులోనూ, భవిష్యత్తులో చేపట్టబోయే మరిన్ని మిషన్లలోనూ మిశ్ర ధాతు నిగమ్ భాగస్వామిగా ఉండనున్నది.
రాకెట్ ప్రోగ్రామ్స్, స్పేస్-స్పేస్ రిసెర్చ్ ప్రోగ్రా మ్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పల్స్ ప్రొటెక్షన్ కార్యక్రమాల్లో పారస్ డిఫెన్స్, అండ్ స్పేస్ టెక్నాలజీస్ భాగస్వామిగా ఉంటున్నది. ముఖ్యంగా ఇస్రో అభివృద్ధిపర్చిన టెక్నాలజీల గుర్తింపులో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌కు సహకరిస్తున్నది.
ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం 88కిపైగా శాటిలైట్లు, 68కిపైగా లాంచ్ వెహికిల్స్‌కు అనంత్ టెక్నాలజీస్ సహకారం అందించింది. చంద్రయాన్-1, 2, మంగళ్యాన్తోపాటు చంద్రయాన్-3 మిషన్‌లోనూ కీలకంగా ఉన్నది. రోదసీలోకి మానవులను తీసుకెళ్లేందుకు చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్టులోనూ ఈ కంపెనీ భాగస్వామిగా ఉంటున్నది.
భారతీయ అంతరిక్ష మిషన్ల కోసం ఈ కంపెనీ ఇప్పటిదాకా రకరకాలకు చెందిన 300ల నుంచి 500 విడిభాగాలను తయారుచేసింది.
ఇప్పటిదాకా ఇస్రో తలపెట్టిన అన్ని మిషన్లలో ఈ కంపెనీ భాగస్వామిగా ఉన్నది. 1993లో పీఎస్ఎల్వీ-డీ1 ప్రాజెక్టు నుంచి ఇస్రోతో పయనిస్తున్నది.
చంద్రయాన్-3 మిషన్‌కు క్రిటికల్ కోర్ కంపోనెంట్స్‌ను సంస్థ అందించింది. రాకెట్ ఇంజిన్లు, థ్రస్టర్ల అభివృద్ధికి కృషి చేసింది.
భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రయాన్-3 విజయం.. భారత అంతరిక్ష పరిశ్రమకున్న విస్తృత సామర్థ్యానికి అద్దం పట్టింది. ఇంతటి ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు. ఈ మిషన్‌లో సజావుగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంపై దిగడం.. దేశీయ ప్రైవేట్ రంగ స్పేస్ కంపెనీలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఎంటార్ టెక్నాలజీస్ గర్వపడుతున్నది. గడిచిన మూడు దశాబ్దాలకుపైగా ఇస్రోతో పనిచేస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే మరిన్ని విజయవంతమైన ప్రాజెక్టులకూ సహకరిస్తాం.
– పర్వత్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ