Chandrayaan-3 | చంద్రుడిపై భారత్ అడుగులు మొదలయ్యాయి : ఇస్రో ట్వీట్
Chandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది.
Chandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. ‘చంద్రుడి కోసం చంద్రయాన్-3 రోవర్ భారత్‌లో తయారైంది. ఇప్పుడు అది ల్యాండర్ నుంచి బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది’ అని ఇస్రో తన ట్వీట్లో పేర్కొంది. చంద్రుడి గుట్టు విప్పడంలో ప్రజ్ఞాన్ రోవర్ ముఖ్య పాత్ర పోషించనుంది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది.
దక్షిణ ధ్రువం ప్రాంతంపై తొలి అడుగు
చంద్రునిపైకి ఇప్పటికే అమెరికా, యూఎస్ఎస్ఆర్, చైనా రోవర్లను పంపాయి. కానీ, వీటిలో ఏ దేశమూ దక్షిణ ధ్రవ ప్రాంతంలో దిగలేదు. మొట్టమొదటిసారి భారతదేశమే ఆ ఘనత సొంతం చేసుకొన్నది. మొత్తంగా చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన మాడ్యూల్‌ను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా అవతరించింది. దీంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది.
Also Read..
Chandrayaan-3 | చంద్రయాన్-3 ఘనవిజయం.. దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరిన తొలిదేశంగా భారత్
Chandrayaan-3 | చంద్రయాన్-3లో ఎంత ఇంధనాన్ని ఇస్రో వినియోగించిందో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

