Chandrayaan-3 | చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ అక్కడ ఏం పనిచేయబోతున్నది? దీనివల్ల ఇస్రోకు ఒరిగేదేంటి?
Chandrayaan-3 | చంద్రుడిపై విజయవంతంగా దిగిన ల్యాండర్ అక్కడ ఏం చేయనున్నది? ప్రగ్యాన్ పరిశోధించేదేమిటి? ప్రొపల్షన్ మాడ్యూల్ ఏం చేయబోతున్నది? ఈ ప్రయోగం వల్ల భారత్, ఇస్రోకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? వంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు.
Chandrayaan-3 | బెంగళూరు, ఆగస్టు 23: చంద్రుడిపై విజయవంతంగా దిగిన ల్యాండర్ అక్కడ ఏం చేయనున్నది? ప్రగ్యాన్ పరిశోధించేదేమిటి? ప్రొపల్షన్ మాడ్యూల్ ఏం చేయబోతున్నది? ఈ ప్రయోగం వల్ల భారత్, ఇస్రోకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? వంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు.
ప్రొపల్షన్ మాడ్యూల్ పని ఇదే…
ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలానికి 100 కి.మీ దూరంలోని కక్ష్య వరకు చేర్చడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. 2,145 కిలోల బరువుండే ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కిలోల ఇంధనం ఉంటుంది. ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉండే స్పెక్ట్రో పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పే లోడ్ అంతరిక్షంలో భూమి తరహాలో వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పరిశోధనలు చేస్తుంది. స్పెక్ట్రో పోలారిమెట్రిక్ సిగ్నేచర్లను గుర్తించి భూమిపై ఉండే ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు పంపిస్తుంది.
ల్యాండర్ విశేషాలు…
- ల్యాండర్ ద్రవ్యరాశి రోవర్‌తో కలిపి 1749.86 కిలోలు ఉంటుంది. ఇది రెండు మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.
- ఇందులో నాలుగు పే లోడ్లు ఉంటాయి.
- జాబిల్లి గురించి రోవర్ సేకరించిన సమాచారాన్ని ల్యాండర్ భూమికి చేరవేస్తుంది.
- ల్యాండర్ జీవితకాలం లూనార్ డేకు సమానం. అంటే భూమిపై 14 రోజులతో సమానం.
- చంద్రుడి దక్షిణ భాగంలోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ధ్రువ ప్రాంతంలో రాత్రి వేళ అతి శీతల ఉష్ణోగ్రతలు ఉంటాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ల్యాండర్, రోవర్ పని చేయవు.
- 14 రోజుల రాత్రి తర్వాత ల్యాండర్, రోవర్ అక్కడి పగటి ఉష్ణోగ్రతల కారణంగా మళ్లీ పని చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ల్యాండర్, రోవర్ రెండు పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది.
- ఇందులో ఉండే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్ అట్మాస్పియర్ (ఆర్ఏఎంబీహెచ్ఏ) పే లోడ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ డెన్సిటీ, సమయానుకులంగా అవి మార్పులకు లోనవడంపై అధ్యయనం చేస్తుంది.
- చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) పే లోడ్ ఉష్ణ లక్షణాలపై దృష్టి సారిస్తుంది.
- ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) పే లోడ్ చంద్ర కంపాలపై అధ్యయనం చేస్తుంది.
- లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే (ఎల్ఆర్ఏ) చంద్రుడి డైనమిక్‌పై పరిశోధనలు చేస్తుంది.
- ఎల్ఆర్ఏలోని మొత్తం ఏడు సెన్సార్లలో ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా ఒకటి.
- ల్యాండర్లో ల్యాండర్ కాళ్లు, రోవర్ ర్యాంప్ (ప్రైమరీ, సెకండరీ), రోవర్, ఐఎల్ఎస్ఏ, ఆర్ఏఎంబీహెచ్ఏ, సీహెచ్ఏఎస్టీఈ పే లోడ్లు, అంబిలికల్ కనెక్టర్ ప్రొటెక్షన్ మెకానిజం, ఎక్స్- బాండ్ యాంటెన్నా రోవర్.
రోవర్ విశేషాలు…
- రోవర్ బరువు కేవలం 26 కిలోలు.
- 91.7 సె.మీ పొడవు, 75 సెం.మీ వెడల్పు, 39.7 సె.మీ ఎత్తు ఉంటుంది.
- దీనికి ఆరు చక్రాలు ఉంటాయి.
- లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ ప్రొపల్షన్ మాడ్యూల్ మూలకాలు, వాటి లక్షణాలపై దృష్టి సారిస్తుంది.
- మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ తదితర ఖనిజాల జాడ కోసం అన్వేషిస్తుంది.
- ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (ఏపీఎక్స్ఎస్) పే లోడ్ మట్టి, రాళ్లపై అధ్యయనం చేస్తుంది.
- జాబిల్లిపై సేకరించిన సమాచారాన్ని రోవర్… ల్యాండర్‌కు చేరవేస్తుంది. ఎందుకంటే నేరుగా సమాచారాన్ని భూమికి చేరవేసే సామర్థ్యం రోవర్‌కు లేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

