న్యూఢిల్లీ: విక్రమ్ మూన్ ల్యాండింగ్‌ను దేశమంతా సెలబ్రేట్ చేసుకున్నది. చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్.. చంద్రుడిపై దిగిన క్షణాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఆ అద్భుత సందర్భాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు. మాజీ క్రికెటర్ ధోనీ(MS Dhoni) కూడా ఆ ఈవెంట్‌ను ఎంజాయ్ చేశాడు. తన మిత్రులతో కలిసి ధోనీ.. ఆ ల్యాండింగ్ క్షణాలను టీవీలో వీక్షించాడు. దానికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ చరిత్రాత్మక సందర్భాన్ని తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశాడు. ఆ సమయంలో తన తొడల్ని కొడుతూ హర్షం వ్యక్తం చేశాడు.
Captain cool #MSDhoni celebrating #Chandrayaan3 success#VikramLander #PragyanRover #ISRO #MoonLanding #India #IndiaOnTheMoon pic.twitter.com/1KKH70glm6
— Vinod (@vinodgounder7) August 23, 2023