SLW vs ENGW : సొంతగడ్డపై చెలరేగి ఆడతారనుకుంటే శ్రీలంక బ్యాటర్లు నిరాశపరుస్తున్నారు. ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(4-5) విజృంభణతో మేము ఆడలేమంటూ డగౌట్‌కు క్యూ కడుతున్నారు. క్రాంప్స్‌తో మైదానం వీడిన కెప్టెన్ చమరి ఆటపట్టు (15)సైతం నిరాశపరిచింది. ఎకిల్‌స్టోన్ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయింది తను. దాంతో.. 116వద్ద లంక ఐదో వికెట్ పడింది. ప్రధాన ప్లేయర్లు చేతులెత్తేసిన వేళ లోయర్ ఆర్డర్ పోరాడుతోంది. ప్రస్తుతం డిసిల్వా(3 నాటౌట్), సంజీవని(1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లకు స్కోర్.. 119-5. ఇంకా లంక విజయానికి 135 రన్స్ కావాలి.
ఇంగ్లండ్ నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. ఆరో ఓవర్లో చమరి ఆటపట్టు క్రాంప్స్ కారణంగా మైదానం వీడడంతో ధాటిగా ఆడేవారే కరువయ్యారు. విష్మీ గుణరత్నే (15) కాసేపు నిలబడినా.. చార్లీ డీన్ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయింది.
Fourth wicket for Sophie Ecclestone as Sri Lanka captain Chamari Athapaththu falls for 15! 🤯
This could well be the turning point for England. 👏🏼#ENGvSL #CWC25 #Cricket #Sportskeeda pic.twitter.com/Cmv0m40APR
— Sportskeeda (@Sportskeeda) October 11, 2025
ఆ తర్వాత ఎకిల్‌స్టోన్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ.. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ హాసిని పెరీరా(35)ను, హర్షిత సమరవిక్రమ(33)లను ఔట్ చేసింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కవిష దిల్హరి(4)ను పెవిలియన్ పంపి లంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటపట్టు (15) కూడా పెద్ద షాట్లు ఆడలేకపోయింది. ఆమె కూడా ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 116 వద్ద లంక సగం వికెట్లు పడ్డాయి.