Asia Cup 2025 : ఆసియా కప్ ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ సూపర్ బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్ చైనాను రషీద్ ఖాన్ నేతృత్వంలోని కాబూలీ టీమ్ చిత్తుగా ఓడించింది. 94 రన్స్‌తో గెలుపొంది పాయింట్లు సాధించింది. గ్రూప్ బీలోని మొదటి మ్యాచ్‌లో తొలుత ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్ధ శతకాలతో చెలరేగి భారీ స్కోర్ అందించారు. అనంతరం బౌలర్లు ఫజల్ హక్ ఫారూఖీ(2-16), గుల్బదిన్ నయీబ్(2-8) విజృంభించగా.. ఫీల్డర్లు రాణించారు. దాంతో.. హాకాంగ్ చైనా బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ అదరగొట్టింది. పసికూన హాంకాంగ్ చైనాను మట్టికరిపించి గ్రూప్ బీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అఫ్గన్ నిర్దేశించిన 189 పరుగుల భారీ ఛేదనలో ఆదిలోనే హాకాంగ్ చైనాకు షాక్ తగలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ పడింది. ఆపై ఇద్దరు రనౌట్ అయ్యారు. డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఐదో వికెట్ పడింది.
All Afghanistan in match 1! A BIG win in Abu Dhabi 🇦🇫#AFGvHK SCORECARD 👉 https://t.co/eo5GtCWQob pic.twitter.com/uZtuQFOlwC
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025
పవర్ ప్లేలోనే సగం మంది పెవిలియన్ చేరినా బాబర్ హయత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. కరీం జనత్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోర్ 50 దాటించాడు. కానీ, అతడి పోరాటాన్ని ముగించాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించి ఐజజ్ ఖాన్ వెనుదిరిగాడు. చివరి ఓవర్లో ఒకే ఒక రన్ మాత్రమే వచ్చింది. దాంతో.. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 94 పరుగులకే పరిమితమైంది.
అసియా కప్‌లో ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్థ శతకాలతో కదం తొక్కగా 188 రన్స్ చేసింది. హాకాంగ్ బౌలర్ల ధాటికి అఫ్గన్ మిడిలార్డర్ విఫలమైనా.. అటల్ క్రీజులో పాతుకుపోయి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక డెత్‌ఓవర్లలో అజ్మతుల్లా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. ఆకాశ్ శుక్లా ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 రన్స్ పిండుకున్న అతడు జట్టు స్కోర్ దాటించాడు. ఆ తర్వాత నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేయగలిగింది.