Pune Test : సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయోత్సాహంలో ఉన్న టీమిండియా పుణేలో పంజా విసరాలనే కసితో ఉంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న భారత జట్టు గెలుపు వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. పుణేలో పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు ఎంపిక ఉండనుందని అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) అంటున్నాడు. అంతేకాదు చివరి రెండు టెస్టుల కోసం రంజీల్లో ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ (Washinton Sunder)ను తీసుకోవడం కూడా తమ వ్యూహంలో భాగమని డస్చేట్ చెప్పాడు.
బెంగళూరు టెస్టులో దారుణ ఓటమి అనంతరం భారత సెలెక్టర్లు వాషింగ్టన్ సుందర్‌ను స్క్వాడ్‌లో చేర్చారు. దాంతో, అశ్విన్‌కు ఏదైనా గాయం అయి ఉంటుందని, అందుకనే సుందర్‌ను పిలిచారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కోచ్ డస్చేట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సుందర్‌ను తీసుకోవడానికి కారణాన్ని వెల్లడించాడు.
🚨 News 🚨
Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBank
Details 🔽
— BCCI (@BCCI) October 20, 2024
‘న్యూజిలాండ్ జట్టులోని 11 మందిలో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. వాళ్ల దూకుడుకు కళ్లెం వేసేందుకు సుందర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నాం. అంతేతప్ప అందరూ అనుకుంటున్నట్టు అశ్విన్‌కు బ్యాకప్‌గా మాత్రం కాదు. ఇక అశ్విన్ విషయానికొస్తే అతడికి ఎలాంటి గాయం కాలేదు’ అని డస్చేట్ మీడియాకు తెలిపాడు.
Captain Rohit Sharma’s Indian team arrived at Pune stadium for practice before 2nd test match #INDvsNZ 🇮🇳🔥 pic.twitter.com/GdSTJIeapv
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 22, 2024
తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ ఇబ్బంది పడిన రిషభ్ పంత్ (Rishabh Pant) ఫిట్‌గానే ఉన్నాడని అతడు వెల్లడించాడు. ‘పంత్ ఆరోగ్యం బాగానే ఉంది. అతడి గురించి కెప్టెన్ రోహిత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే.. పంత్ మోకాలి నొప్పితో కొంచెం అసౌకర్యంగానే కనిపిస్తున్నాడు. కానీ, అతడు నెట్స్‌లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు’ అని డస్చేట్ వివరించాడు. తొలి టెస్టులో గెలుపొందిన కివీస్ రెట్టించిన ఉత్సాహంతో పుణేలో ఆడనుంది. ఇక సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న రోహిత్ సేన గట్టిగానే బదులివ్వనుంది. అక్టబోర్ 24న ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మొదలవ్వనుంది.
Sound 🔛
Travel Day ✅#TeamIndia has reached Pune 👍#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/5CFAoK0dcJ
— BCCI (@BCCI) October 21, 2024