హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలనుకున్న హైదరాబాద్ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. ఉప్పల్ వేదికగా జరిగిన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 231 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 228/9తో శుక్రవారం చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్.. మరో మూడు పరుగులు జోడించి ఆలౌటైంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉండి విజయానికి 22 పరుగులు చేయాల్సి ఉన్న హైదరాబాద్ ఐదు బంతుల్లోనే వికెట్ కోల్పోయింది.
జట్టును గెలిపించేందుకు కడవరకు పోరాడిన కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (126 నాటౌట్) అజేయంగా మిగిలాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 28 బంతుల్లోనే 78 (8 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేసిన అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.