ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ పోటీలకు ప్రవల్లిక
ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లో పాల్గొనే భారత 4స400 మీటర్ల రిలే జట్టుకు తెలంగాణ అథ్లెట్, ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్ నరిమళ్ల ప్రవల్లిక ఎంపికైంది. నల్లగొండ జిల్లా దిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక చైనాలోని ఆర్డోస్ నగరంలో జూలై 9 నుంచి జరిగే ఆసియా అండర్23 పోటీల్లో భారత్ తరఫున పోటీ పడనుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లో పాల్గొనే భారత 4స400 మీటర్ల రిలే జట్టుకు తెలంగాణ అథ్లెట్, ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్ నరిమళ్ల ప్రవల్లిక ఎంపికైంది. నల్లగొండ జిల్లా దిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక చైనాలోని ఆర్డోస్ నగరంలో జూలై 9 నుంచి జరిగే ఆసియా అండర్23 పోటీల్లో భారత్ తరఫున పోటీ పడనుంది.
ప్రవల్లిక ఐదో తరగతి నుంచే దిండి గురుకుల క్రీడా అకాడమీలో శిక్షణ పొందుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో 35, జాతీయ స్థాయిలో 3 కాంస్య పతకాలు సాధించింది. అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైన ప్రవల్లికను తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యాయామ సంచాలకులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం చైర్మన్ రామలక్ష్మణ్, అధ్యక్షులు ఎం. నర్సయ్య అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

