Hockey Champions Trophy | హలన్బుయిర్: చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో భారత్ 3-0తో చైనాపై ఏకపక్ష విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది.
పారిస్లో కాంస్య పతకం గెలిచిన తర్వాత మొదటి మ్యాచ్ ఆడిన భారత్కు సుఖ్జీత్ (14వ నిమిషం), ఉత్తమ్ (27), అభిషేక్ (32) మూడు గోల్స్ చేసి ఘనవిజయాన్ని అందించారు.