జకర్తా: భారత యువ బాక్సర్లు విశ్వనాథ్ సురేశ్, గంగా ఆసియా అండర్-23 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పంచ్ విసిరారు. గురువారం జరిగిన ఫైనల్ బౌట్లలో భాగంగా మెన్స్ 50 కేజీ క్యాటగిరీలో విశ్వనాథ్.. 3-2తో దైచీ ఇవాయ్ (జపాన్)ను మట్టికరిపించి స్వర్ణం గెలిచాడు. 55 కిలోల విభాగంలో గంగా సైతం 3-2తో కజకిస్థాన్ ప్లేయర్ బొరన్బెక్ను ఓడించాడు. 65 కేజీ కేటగిరీ ఫైనల్లో వన్షజ్ పోరాడినా 1-4తో ఎర్గశెవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.