బుడాపెస్ట్ (హంగేరి): భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణంతో సత్తాచాటాడు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ క్యాటగిరీలో అతడు 13-3తో రాబర్ట్ డింగాష్విలి (జర్మనీ)ని ఓడించి పసిడి పతకం నెగ్గాడు. అమన్తో పాటు పురుషుల 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగపు కాంస్య పోరులో దీపక్ 9-8తో నురద్దిన్ నవ్రుజొవ్ (అజర్బైజాన్)పై గెలిచి మెడల్ గెలిచాడు.