హైదరాబాద్, ఆట ప్రతినిధి: బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టోర్నీకి తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. గురువారం సోనీపట్(హర్యానా) వేదికగా జరిగిన ట్రయల్స్‌లో చికిత సత్తాచాటింది.
మహిళల కాంపౌండ్ సీనియర్ విభాగంలో ప్రతీకా ప్రదీప్(మహారాష్ట్ర, 2075) అగ్రస్థానంలో నిలువగా, చికిత(తెలంగాణ, 2082), వెన్నెం జ్యోతిసురేఖ(ఏఏఐ ఆఫీస్, 2099) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత మరోమారు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు పట్టుదలతో ఉంది.