Tanvi Patri | చెంగ్డూ: భారత యువ షట్లర్ తన్వి పత్రి బ్యాడ్మింటన్ ఆసియా అండర్ -15 మహిళల సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న అండర్-15, అండర్ -17 బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం ముగిసిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఒకటో సీడ్ తన్వి.. 21-19, 21-10తో కకానిక్ (థాయ్‌లాండ్)ను ఓడించి తుదిపోరుకు చేరింది.
కాగా అం డర్-17 సెమీస్ బాలుర విభాగంలో జ్ఞాన దత్తు 9-21, 21-13, 21-13తో రదిథ్య బయు (ఇండోనేషియా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.