Asian Games | ఆసియాగేమ్స్ భారత్ అదిరిపోయే ఆరంభం లభించింది. పోటీలకు తొలి రోజైన ఆదివారం భారత్ ఐదు పతకాలతో తళుక్కుమంది. రోయింగ్ మొదలైన పతక జోరు షూటింగ్ ముగిసింది. పురుషుల డబుల్ స్కల్స్ అర్జున్, అరవింద్ ద్వయం వెండి వెలుగులు విరజిమ్మగా, ఎయిట్ ఫైనల్లో రజతం, పెయిర్ విభాగంలో కాంస్యం దక్కింది. మహిళల ఎయిర్ రైఫిల్ షూటింగ్ రమిత, మెహులీ, అశి త్రయం రజత గురితో ఆకట్టుకున్నారు. అదే జోరు కొనసాగిస్తూ వ్యక్తిగత విభాగంలో రమిత కాంస్యం ఖాతాలో వేసుకుంది. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ రుచిచూపిస్తూ ప్రిక్వార్టర్స్ దూసుకెళ్లింది. మహిళల క్రికెట్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, ఫుట్ అమ్మాయిల పోరాటం ముగిసింది. హాకీలో ఉజ్బెకిస్థాన్ భారత్ భారీ విజయంతో కదంతొక్కగా, ఫుట్ సునీల్ ఛెత్రీ సేన ప్రిక్వార్టర్స్ ప్రవేశించింది.
హాంగ్జౌ: ఆసియాగేమ్స్ భారత్ పతక జోరు మొదలైంది. గతానికి భిన్నంగా ఈసారి ఎలాగైనా వంద పతకాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆ దిశగా ముందుకెళుతున్నది. పోటీలకు మొదటి రోజైన ఆదివారం భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. పురుషుల రోయింగ్ లైట్ డబుల్ స్కల్స్ విభాగంలో అర్జున్ జాట్, అరవింద్ సింగ్ ద్వయం 6:28:18సెకన్ల టైమింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకంతో మెరిసింది. ఇదే విభాగంలో చైనాకు స్వర్ణం, ఉజ్బెకిస్థాన్ కాంస్య పతకాలు దక్కాయి. అదే జోరు కనబరుస్తూ పురుషుల ఎయిట్ ఈవెంట్ ఫైనల్లో నీరజ్, నర్కేశ్ కల్వానియా, నితీశ్ చరణ్ జస్విందర్ భీమ్ పునిత్ అశిశ్ కూడిన భారత రోయింగ్ బృందం 5:43:01సె టైమింగ్ రజత పతకాన్ని ముద్దాడింది. ఇదే కేటగిరీలో చైనాకు పసిడి ఇండోనేషియాకు కాంస్యం లభించాయి. మరోవైపు పురుషుల రోయింగ్ కాక్స్ పెయిర్ ఈవెంట్ తుదిపోరులో భారత ద్వయం బాబులాల్,లేఖ్ 6:50:41సెకన్ల టైమింగ్ మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. హాంకాంగ్ (6:44:20సె), ఉజ్బెకిస్థాన్ (6:48:11సె) స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.
ప్రిక్వార్టర్స్ నిఖత్ జరీన్
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే విజయంతో ఆసియాగేమ్స్ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన 50కిలోల బౌట్ నిఖత్ 5-0తో తీ తామ్ న్యుజెన్(వియత్నాం)పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్..ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించింది. పదునైన పంచ్ తోడు సూపర్ జాబ్స్ ప్రత్యర్థి లక్ష్యంగా విరుచుకుపడింది. గత ప్రపంచ చాంపియన్ రజత విజేత అయిన న్యూజెన్..నిఖత్ దీటైన పోటీనివ్వడంలో విఫలమైంది. 54కిలోల విభాగంలో ప్రీతి పవార్ క్వార్టర్స్ ప్రవేశించింది.
షూటింగ్ డబుల్ ధమాకా
షూటింగ్ భారత మహిళలు సత్తాచాటారు. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ రమిత జిందాల్, మెహులీ ఘోష్, అశి చౌక్సితో కూడిన భారత త్రయం 1886 స్కోరుతో రజతంతో మెరిసింది. చైనా (1896), మంగోలియా (1880) వరుసగా స్వర్ణ, కాంస్యం సొంతం చేసుకున్నాయి. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంతో కాంస్య ఖాతాలో వేసుకుంది. హువాంగ్, హాన్ (చైనా) వరసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్ బంగ్లాదేశ్ భారీ విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల ఫుట్ భారత్ ప్రస్థానం ముగియగా, పురుషుల కేటగిరీలో సునీల్ ఛెత్రీసేన ప్రిక్వార్టర్స్ ప్రవేశించింది. హాకీలో భారత్ 16-0తో ఉజ్బెకిస్థాన్ భారీ విజయం సాధించింది. పురుషుల వాలీబాల్ క్వార్టర్స్ భారత్ 0-3తో జపాన్ ఓడి నిష్క్రమించింది. టెన్నిస్ సింగిల్స్ సుమిత్ ప్రిక్వార్టర్స్ ప్రవేశించాడు. టీటీ టీమ్ మన పురుషుల, మహిళల జట్లు ఓటములతో వెనుదిరిగాయి. మహిళల రగ్బీ-7లో భారత్ 0-38తో హాంకాంగ్ ఓడింది.