ముంబై : యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ త్వరలో జరుగబోయే ఆసియా కప్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా మొదలుకాబోయే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే భారత్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
జైస్వాల్, గిల్‌ను టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువగా టెస్టులకే వినియోగిస్తున్నా వాళ్లు గత జూన్‌లో ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టారు. ఇంగ్లండ్‌తో టెస్టులు ముగిసిన నేపథ్యంలో ఆసియా కప్ ప్రారంభానికి ఇంకా నెలకు పైగా సమయం ఉండటంతో ఈ త్రయం మెగా టోర్నీ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్టు బోర్డు వర్గాల వినికిడి.