కొలంబో: ఆసియా కప్ -2023లో భాగంగా సూపర్-4 స్థాయిలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడం ఈ మ్యాచ్‌లో భారత్‌కు అదనపు బలం. పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా గ్రూప్ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులో చేరాడు.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్, జస్ప్రీత్ బుబ్రా, మహమ్మద్ సిరాజ్.
పాకిస్తాన్ తుది జట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ ఆష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిష్ రవూఫ్.