బెంగళూరు: వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. జట్టు సెలెక్షన్ సమయంలోనే రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొనగా.. ఇప్పుడా మాటే నిజమైంది.
బుధవారం నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.