Ravichandran Ashwin | 500.. 501 మధ్య ఆ 48 గంటలు.. అశ్విన్ భార్య ప్రీతి పోస్ట్ వైరల్
Ravichandran Ashwin : భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ) రాజ్‌కోట్ టెస్టులో ఐదొందల వికెట్ల క్లబ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్పిన్ మాంత్రికుడి రికార్డు వికెట్ తీయడంపై భార్య ప్రీతి(Prithi) ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. అందులో 500...
Ravichandran Ashwin : భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ) రాజ్‌కోట్ టెస్టులో ఐదొందల వికెట్ల క్లబ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాంతో, ఈ ఘనత సాధించిన రెండో భారత స్పిన్నర్‌గా, తొమ్మిదో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఈ స్పిన్ మాంత్రికుడి రికార్డు వికెట్ తీయడంపై భార్య ప్రీతి(Prithi) ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. అందులో 500.. 501వ వికెట్ మధ్య ఎంతో జరిగిందని ఆమె తెలిపింది.
‘ఉప్పల్ టెస్టులోనే అశ్విన్ 500 వికెట్ తీస్తాడని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ తర్వాత వైజాగ్ టెస్టులోనూ అది సాధ్యపడలేదు. దాంతో, 499వ వికెట్ సమయంలో తెచ్చిన స్వీట్లను అందరికీ పంచేశాం. 500వ వికెట్ అనేది అలా వచ్చేసింది. 500 నుంచి 501 వికెట్.. ఈ రెండిటి మధ్య సుదీర్ఘమైన 48 గంటలు ఉన్నాయి. 500 వికెట్లు తీయడమనేది చాలా గొప్ప విషయం. అశ్విన్ ఒక అద్భతమైన వ్యక్తి. అతడిని చూసి నేనెంతో గర్వపడుతున్నా’ అని ప్రీతి రాసుకొచ్చింది.
ఇంగ్లండ్ పర్యటన ఖరారు కాగానే యావత్ భారత అభిమానులంతా అశ్విన్ 500వ వికెట్ ఎప్పుడెప్పుడు తీస్తాడని ఆతృతగా ఎదురుచూశారు. అందరూ ఊహించినట్టుగానే రాజ్‌కోట్ టెస్టుల్ యశ్.. తన ఆ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేసి దిగ్గజాల సరసన చేరాడు. 500 వికెట్ తీసిన ఆనందంలో ఉండగానే తల్లి చిత్ర(Chitra)కి ఆరోగ్యం బాగాలేదని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది.
అశ్విన్, అనిల్ కుంబ్లే

దాంతో, అశ్విన్ హుటాహుటినా బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్ నుంచి చెన్నైకి వెళ్లాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ అదే విమానంలో రాజ్‌కోట్ వచ్చేశాడు. నాలుగోరోజు టీ సెషన్ తర్వాత జట్టుతో కలిసిన అశ్విన్ ఆరు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై జయకేతనం ఎగురవేసింది.
ఇవి కూడా చదవండి
- Viral Video | బట్టతలతో దువ్వెన ఏం చేసుకుంటా..: వీధి వ్యాపారితో ఆకట్టుకున్న అనుపమ్ ఖేర్ సంభాషణ
- Viral Video | కదులుతున్న కారుపై స్టంట్స్.. ఆకతాయిలకు తగిన బహుమతి ఇచ్చిన పోలీసులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

