Viral Video | కదులుతున్న కారు (moving car)పై ప్రమాదకర స్టంట్స్ (dangerous stunts) చేసిన ఇద్దరు యువకులకు పూణే పోలీసులు (Pune Polices) గట్టి షాక్ ఇచ్చారు. రద్దీ రోడ్డుపై వారు చేసిన ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు తగిన బహుమతి (prize) ఇచ్చారు. ఈ విషయాన్ని పింప్రి చించ్వాడ్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలియజేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పూణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింప్రి-చించ్వాడ్ (Pimpri-Chinchwad)లోని ఓ రద్దీ రోడ్డుపై ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్స్ చేశారు. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి టాప్‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ దృశ్యాలను వెనుక వెళ్తున్న వాహనదారులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారి పోలీసులకు దృష్టికి వెళ్లింది. దీనిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
యువకులు చేసిన ఈ చర్యను ‘స్టంట్ బాజీ’గా పేర్కొన్న పోలీసులు వీడియోని ఎక్స్‌లో పోస్టు చేశారు. టెల్కో రోడ్డులో ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్స్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. వారు చేసిన ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ (Adventure Sports)కి తగిన బహుతి ఇచ్చినట్లు తెలిపారు. నేరస్థులపై ఐపీసీ సెక్షన్ 279, 336, మోటారు వాహనాల చట్టంలోని 184, 119, 177 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్టంట్‌కు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1️⃣ ON THE LEFT is a WhatsApp Video we came across of two boys doing ‘STUNTBAAZI’ on Telco Road
2️⃣ ON THE RIGHT is the ‘PRIZE’ we gave them for their Adventure Sports
कलम २७९, ३३६ आयपीसी आणि कलम १८४, ११९, १७७ एमव्हीए अंतर्गत गुन्हा दाखल….आणि वाहन जप्त करण्यात आले आहे.
अशा… pic.twitter.com/oA6UaVogWR
— पिंपरी चिंचवड पोलीस – Pimpri Chinchwad Police (@PCcityPolice) February 16, 2024
Also Read..
Ajit Pawar | మహారాష్ట్రలో సుప్రియా సూలే వర్సెస్ సునేత్ర పవార్.. బారామతిలో రసవత్తర పోరు..!
Black Panther | ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్.. వీడియో
Stage Collapses | పెళ్లి వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక కూలి పలువురికి గాయాలు