Ashwin : నిరుడు ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin). తన రిటైర్మెంట్పై వస్తోన్న ఊహాగానాలకు తెరదించుతూ.. జట్టులో చోటు దక్కకపోవడంతోనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడీ లెజెండ్. దాంతో.. అప్పటి నుంచి అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ల ఒత్తిడితోనే అశ్విన్ అల్విదా చెప్పాడనే విమర్శలు జోరందుకున్నాయి. జట్టుకు ఎంతో సేవ చేసిన అతడిని అవమానపరిచారంటూ క్రీడాలోకం హిట్‌మ్యాన్, గౌతీలపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో స్పిన్ మాంత్రికుడు వివాదాలకు తెరదించుతూ కీలక విషయాలు పంచుకున్నాడు.
తన యూబ్యూట్ ఛానెల్లో మాట్లాడుతూ తన వీడ్కోలుకు రోహిత్, గంభీర్ కారణం కాదని అశ్విన్ అన్నాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ మూడో టెస్టు తర్వాత నేను వీడ్కోలు పలికాను. అయితే.. నువ్వు రిటైరవ్వు అని నాకు ఎవరూ చెప్పలేదు. జట్టులో నీకు చోటు లేదు అని కూడా కోచ్ గంభీర్గానీ, కెప్టెన్ రోహిత్గానీ నాతో అనలేదు. నిజానికి వీడ్కోలు ఆలోచనను ఇద్దరి ముగ్గురితో పంచుకున్నా. అప్పుడు వాళ్లు.. వద్దని వారించారు. రోహిత్, గంభీర్ కూడా కొన్నాళ్లు ఆడితే బాగుంటుంది.
🚨🚨🚨🚨Ashwin about his retirement
“No one told me to go. No one said that there is no place for you in the team. 2–3 people told me not to retire. They wanted me to play more. Even Rohit said, “Think about it, Ash. Why do you want to do it?” Gautam Gambhir also said the same pic.twitter.com/y3UWlk4oEZ— Wickets Hitting (@offpacedelivery) October 8, 2025
మరోసారి ఆలోచించుకో అని అన్నారు. కానీ, నేను వినలేదు. అయితే.. ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో మాత్రం మాట్లాడలేదు. రిటైర్మెంట్ తీసుకోవాలి అనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఏ క్రికెటర్‌కైనా ఇది వ్యక్తిగత నిర్ణయం కదా’ అని అశ్విన్ వెల్లడించాడు.
కొన్ని నెలలు వీడ్కోలుపై మౌనంగా ఉన్న అశ్విన్ యూట్యూబ్ స్టోరీస్‌లో రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడాడు. మాటల సందర్భంలో నీ రిటైర్మెంట్కు కారణం ఏంటి? అని ద్రవిడ్ అడుగగా.. ఎట్టకేలకు ఓపెన్ అయిన యశ్ బెంచ్ మీద ఉండలేకనే వీడ్కోలుకు సిద్ధపడ్డాను అని వెల్లడించాడు. ‘బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు ముగిసిన తర్వాత వీడ్కోలు బాంబ్ పేల్చాడు. సమయం రాగానే వీడ్కోలు పలకాలని అనుకున్నా. నేను జీవితంలో ఏ దశలో ఉన్నాను? అని ఆలోచించాను. నాకు వయసైపోతుందని గ్రహించాను. స్క్వాడ్‌తో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లడం వరకూ బాగానే ఉంటుంది. కానీ, పదకొండు మందిలో లేకుండా ఎక్కువ రోజులు బెంచ్‌మీద కూర్చోవడం ఎంతో బాధిస్తుంది.
నాకూ అదే పరిస్థితి ఎదురైంది. సో.. ఇక నా కెరీర్ ముగించేందుకు సమయం వచ్చిందని అర్ధమైంది. అందుకే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే ప్రకటన చేశాను’ అని అశ్విన్ పేర్కొన్నాడు. 106 టెస్టులు ఆడిన ఈ తమిళ తంబీ 537 వికెట్లు తీశాడు. ఎనిమిదిసార్లు పది వికెట్లు, 37సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడీ స్పిన్ లెజెండ్. వీడ్కోలు తర్వాత టీ20లీగ్స్‌పై దృష్టిసారిస్తానని చెప్పిన అశ్విన్. ఒకే ఏడాదిలో మూడు విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు సై అంటున్నాడు. మొదటగా హాంకాంగ్ సిక్సర్స్ (HongKong Sixers) టోర్నీలో ఆడేందుకు ఓకే చెప్పిన అశ్విన్.. బిగ్‌బాష్ లీగ్‌లోనూ మెరవనున్నాడు.