అడిలైడ్: యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఇంగ్లండ్.. మూడో టెస్టులోనూ తన ఆటతీరును మార్చుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 371కే పరిమితం చేసిన ఆ జట్టు.. తర్వాత బ్యాట్‌తో మాత్రం చేతులెత్తేసింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 213 రన్స్ చేసింది. హ్యారీ బ్రూక్ (45), కెప్టెన్ బెన్ స్టోక్స్ (45 నాటౌట్), ఆర్చర్ (30*) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అడిలైడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన కంగారూ సారథి పాట్ కమిన్స్ (3/54) ఇంగ్లిష్ టాపార్డర్ వెన్నువిరవగా స్కాట్ బొలాండ్ (2/31), స్పిన్నర్ నాథన్ లియాన్ (2/51) తలా రెండు వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇంకా 158 పరుగులు వెనుకబడే ఉంది.